aipeup3 Vijayawada

Tuesday, 25 October 2011

మహిళా తపాలా వుద్యోగుల రాష్ట్ర స్థాయి సదస్సు -ఒంగోలు- 23-10-2011

నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ - 
జి.డి.ఎస్ సంఘాల రాష్ట్ర సమన్వయ సమితి ఆధ్వర్యములో 
ఒంగోలు డివిజన్ , ఒంగోలు పట్టణం, 
శ్రీ బచ్చల బాలయ్య, సంజీవమ్మ గార్ల కళ్యాణ మండపం నందు 
23-10-2011 న పోస్టల్ వుద్యోగుల రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు నిర్వహించ బడినది 
ఎన్.ఎఫ్.పి.యి. ఉన్నత కార్యదర్శి కా. ఎం.కృష్ణన్ ముఖ్య అతిధిగా హాజరైనారు. 
గౌరవ అతిధిగా శ్రీ డి.ఎస్.వి.ఆర్.మూర్తి గారు, డి.పి.ఎస్., విజయవాడ రీజియన్ హాజరైనారు. మరియు కా.ధనలక్ష్మి (సర్కిల్ కన్వినర్ , వర్కింగ్ వుమెన్ కో ఆర్డి నేషన్ కమిటీ,హైదరాబాద్ ), శ్రీమతి.ఆర్.సుయజ్ (రీజనల్ జాయింట్ డైరెక్టర్, వుమెన్ & చైల్డ్ వెల్ఫేర్ ,ఒంగోలు), 
శ్రీ ఎస్. శివ ప్రసాద్, సుపరిన్ టెన్ డెంట్ ఆర్ పోస్ట్ ఆఫిసేస్, ఒంగోలు గార్లు 
ఆహ్వానితులుగా పాల్గొన్నారు. 
కా. లక్ష్మీదేవి, మహిళా సబ్ కమిటీ కన్వేనర్ (కన్ఫెదేరేషన్ తరపున ), 
కా. పుష్పేశ్వరి దేవి, మహిళా సబ్ కమిటీ సభ్యురాలు (ఎన్.ఎఫ్.పి.యి తరపున) 
కూడా పాల్గొన్నారు. 
కా. ఎస్.కే.హుమాయున్, కా.పాండురంగరావు,కా. కే.నారాయణ రావు, కా.వై.నాగభూషణం -సర్కిల్ కార్యదర్శులు హాజరైనారు. 
ఈ సదస్సునకు అన్ని రీజియన్ల నుండి బ్రాంచ్/డివిజన్ కార్య దర్శుల తో పాటుగా సుమారు600 మంది పైగాపాల్గొన్నారు. సుమారు 300 మంది పైగా మహిళా ప్రతినిధులు హాజరైనారు. 
కా. ఎం. కృష్ణన్ ఎన్.ఎఫ్.పి.యి పతాక ఆవిష్కరణ గావించగా , 
కా. డి. ఎ. ఎస్.వి. ప్రసాద్ అధ్యక్షతన సదస్సు నిర్వహించ బడినది. 
11 మంది మహిళా ఉద్యోగులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయబడినది. 
ఈ కమిటీ నందు (జి.డి.ఎస్. ప్రతినిధి ) అధ్యక్షులుగా / చైర్మన్ గా (ఒంగోలు డివిజన్ నుండి), 
కా. బి. రమణమ్మ గారు ( నంద్యాల డివిజన్ నుండి), 
కా. టి. వర లక్ష్మి గారు (సూర్యాపేట డివిజన్ నుండి) కమిటీ సభ్యులుగా ఎంపిక కాబడినారు. 
పోస్ట్ మాన్ - గ్రూప్.డి సంఘం నుండి - కా.సునీత (హైదరాబాద్ జి.పి.ఓ), 
కా.ఎ.వి.అరుణ కుమారి (విశాఖ పట్టణం) నుండి కమిటీ సభ్యులుగా ఎంపికైనారు.
గ్రూప్.సి. సంఘం నుండి _ కా.మాధవి లత(హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్), కన్వీనర్ గా , 
కా.ఆర్ . నిర్మల (అనంతపూర్ డివిజన్ నుండి) కా. అరుణ జ్యోతి (విశాఖ పట్టణం డివిజన్) సభ్యులుగా ఎంపికైనారు.
ఈ సదస్సు నుద్దేశించి సుమారు 15 మంది పైగా మహిళా ఉద్యోగులు పలు సమస్యల పైప్రసంగించారు.
కా. ఎ. వెంక టేశ్వర్లు (జి.డి.ఎస్. అధ్యక్షులు, ఒంగోలు డివిజన్) వందన సమర్పణతోసమావేశము ముగించ బడినది.
సదస్సు ఏర్పాట్లు ఘనంగా మరియు విజయవంతంగా నిర్వహించిన ఒంగోలు డివిజన్ ఎన్.ఎఫ్.పి.యి తపాలాఉద్యోగులందరికీ పేరు పేరునా  విజయవాడ డివిజన్ 
ఎన్.ఎఫ్.పి.యి   సంఘముల  తరఫున  కృత జ్ఞాతాభివందనములు.

0 comments:

Post a Comment